కరోనా వైరస్ మన దేశంలో పుట్టింది కాదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది విదేశాలనుంచి మనదేశానికి వచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వైరస్ లక్షణాలున్న 14 మంది కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని, వీరికి ఎలాంటి ప్రమాదం లేదని సీఎం చెప్పారు. వైరస్ విదేశాల నుంచి వచ్చింది కాబట్టి అంతర్జాతీయ విమానాలను కేంద్రం ఎప్పుడో రద్దు చేయాల్సింది. ఎందుకు ఆదిశగా చర్యలు చేపట్టలేదో తెలియదని, ఇప్పటికైనా మించి పోలేదు తక్షణమే ఇంటర్నేషినల్ ఫ్లైట్స్‌ను వెంటనే రద్దు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రేపు ప్రధానితో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఇదే మాట చెబుతామని సీఎం వెల్లడించారు. 22 నుంచి అంతర్జాతీయ విమానాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై సీఎం మీడియాతో మాట్లాడారు.
అంతర్జాతీయ విమానాలు వెంటనే రద్దు చేయాలి : సీఎం కేసీఆర్