కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కోసం పోలీస్‌శాఖ మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు తెచ్చింది. పోలీస్ సిబ్బంది రక్షణకు మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయం, రాచకొండ కమిషనరేట్‌లో ఇప్పటికే మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 25 మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు, లాక్‌డౌన్ విధులు, చెక్‌పోస్టుల వద్ద బందోబస్తులో ఉండే సిబ్బందితో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఈ మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది సేఫ్టీ టన్నెల్లోకి వెళ్లి 10 సెకన్లపాటు ఉంటే క్రిమిసంహారక మందు స్ప్రే చేయడం ద్వారా ఏవైనా వైరస్‌లు ఉంటే చనిపోతాయన్నారు.