ప్రముఖ హాలీవుడ్ నిర్మాత వైన్‌స్టీన్( 67) లైంగిక వేధింపుల నేపథ్యంలో జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే తనకి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలడంతో జైలులోనే ప్రత్యేక నిర్భందంలో ఉంచారు. తాజాగా అతని క్వారంటైన్ పూర్తి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో కరోనా నెగెటివ్ వచ్చినట్టు తెలుస్తుంది . ఇప్పడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అని హార్వే అధికార ప్రతినిధి జుడా ఎంగెల్మేయర్ తెలిపారు. అయితే కొన్ని ప్రత్యేక చట్టాల ప్రకారం వెయిన్‌స్టీన్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని జైలు అధికారి క్రెయిగ్ రోత్‌ఫెల్డ్ అన్నారు. రైకర్స్ ద్వీపంలోని జైలులో ఉన్న ఆయన వారం రోజలు తర్వాత వెండేలోని జైలుకు తరలించబడ్డారు. అప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.
వెయిన్‌స్టీన్ 2006లో మీమీ హలేయిని, 2013లో జెస్సికా మన్న్‌లని లైంగికంగా వేధించడాని పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉన్న న్యూయార్క్ జ్యూరీ తీర్పునిచ్చింది . హాలీవుడ్ నిర్మాత లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని పేర్కొంది. వెంటనే జైలుకు తరలించాలని జడ్జి ఆదేశించింది. 80 మందికి పైగా ప్రముఖ నటీమణులని ఈ హాలీవుడ్ నిర్మాత వేధించాడని ప్రధాన ఆరోపణగా తెలుస్తుంది. ది ఇంగ్లీష్ పేషెంట్, షేక్స్‌పియర్ ఇన్ లవ్ చిత్రాల ద్వారా వెన్‌స్టీన్ చాలా పాపులర్ అయ్యాడు.